Breaking News

Daily Archives: January 22, 2021

ఆలస్యం చేస్తే ప్రాణం పోయే అవకాశముంది

నిజామాబాద్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొద్దిపాటి చర్యలవల్ల యాక్సిడెంట్లు తగ్గించగలుగుతామంటే అంతకన్నా సంతోషం ఏమీ లేదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో రోడ్‌ సేఫ్టీ కమిటీ సమీక్ష సమావేశం కమిటీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన సంబంధిత శాఖలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రమాదాలను తగ్గించడానికి చిన్నపాటి ఏర్పాట్లతో కొంత ఖర్చుతో చర్యలు తీసుకోవడం వల్ల లైఫ్‌ సేపు అవుతుందనీ, బ్లాక్‌ స్పాట్స్‌ జాయింట్‌ ...

Read More »

అర్హులైన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు

కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను అర్హులైన లబ్దిదారులకు గౌండింగ్‌ చేపట్టాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లతో గొర్రెల యూనిట్ల గౌండింగ్‌ పై సమీక్షించారు. ప్రభుత్వం కల్పించే 75 శాతం సబ్సిడీ కింద క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్దిదారులకు వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్సులో జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్‌ జగన్నాధచారి పాల్గొన్నారు.

Read More »

సన్మాన కార్యక్రమం రద్దు చేసుకోండి…

కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో గజానాన్‌ పటేల్‌ జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఎన్నిక అయినందుకు కామారెడ్డి పట్టణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంపత్‌ గౌడ్‌, బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి కలిసి జిల్లా యువజన అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కానీ మీరు మమ్మల్ని సంప్రదించకుండా స్వయంగా మీరు సొంతంగా నిర్ణయం తీసుకుని ఒంటెద్దు పోకడలకు ...

Read More »

కనీస పెన్షన్‌ రూ. 6 వేలు అమలు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలోని పిఎఫ్‌ రీజినల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పిఎఫ్‌ రీజినల్‌ కార్యాలయ ఏవోకి వినతి పత్రం సమర్పించారు. ఈ సంరద్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 1995 చట్ట సవరణ ప్రకారం ఈపీఎఫ్‌ఓ ట్రస్ట్‌ బోర్డ్‌ నుండి 50 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలు నిండిన తదుపరి రాజీనామా చేసిన బీడీ కార్మికులకు కనీస పెన్షన్‌ వెయ్యి రూపాయలు మాత్రమే ...

Read More »

అభివద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 52వ డివిజన్‌ మొఘల్పురా రోడ్డులో టియుఎఫ్‌ఐడిసి 20లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్‌ నీతూ కిరణ్‌ భూమి పూజ చేసి ప్రారంభించారు. నగరంలో అభివద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు బిగాల గణేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ఇంద్రిస్‌ ఖాన్‌, ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ షకీల్‌, ...

Read More »

విద్యాసాగర్‌ రావు దిష్టిబొమ్మ దగ్దం

బీర్కూర్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నసురులాబాద్‌ మండల కేంద్రంలో, బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్య సాగర్‌ రావు దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మాండ్లు యాదవ్‌ మాట్లాడుతు హిందువుల మనోభావాలు దెబ్బతినేవిధంగా మాట్లాడం సిగ్గు చేటని, ఆయన భారతదేశం సంస్కతి సంప్రదాయాలు కించపరిచే విధంగా మాట్లాడం భారత దేశ ఐక్యతను దెబ్బ తీసేలా ఉన్నాయన్నారు. ఇలాంటి దేశ ద్రోయి తన మాటలను వెనక్కి తీసుకొని దేశ ప్రజలకు క్షమాపణ ...

Read More »

తడిపొడి చెత్త నిర్మూలనకు సహకరించాలి

నిజామాబాద్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నగరంలోని 17వ డివిజన్‌ గౌతమ్‌ నగర్‌ కమ్యూనిటీ హల్‌లో తడిపొడి చెత్త నిర్వహణపై మహిళలకు మెప్మ సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ తన ఇంటి నుండే తడిపొడి చెత్త వేరు చేయాలని, మన రోజు వారి అవసరాల నుండి వచ్చే తడి చెత్తను ఒక డబ్బాలో, పొడి చెత్తను మరో డబ్బాలో ...

Read More »