నిజామాబాద్, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని పరాక్రమ దివస్‌గా పాటిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం సాధించడంలో సాయుధ ఆర్మీ ద్వారా విశేష కషి చేశారని చెప్పారు.
నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ దేశ స్వతంత్ర సాధనలో దేశభక్తితో జాతీయవాదం తో ప్రత్యేక కార్యాచరణ ద్వారా దేశ సౌభాగ్యం సాధించడంలో యువతను భాగస్వామ్యం చేస్తూ బ్రిటిష్ వలస పాలకులు వదిలి వెళ్లే విధంగా విశేష కషి చేశారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…? - February 25, 2021
- వన్నెల్ (బి)లో పోలీసు కళాజాత - February 25, 2021
- 26లోగా పూర్తి చేయాలి - February 24, 2021