నిజామాబాద్, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిదా రచయితల సంఘం చేస్తున్న సాహిత్య సేవలు అభినందనీయమని, నూతన సంవత్సరంలో తెలంగాణ అస్తిత్వాన్ని చాటే మరిన్ని సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాలని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో హరిదా రచయితల సంఘం రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, నరాల సుధాకర్, దశరథ్ కొత్మీర్కర్, గోశిక నరసింహ స్వామి, గుత్ప ప్రసాద్, మూడ్ కిషన్, కేతన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిదా రచయితల సంఘం తరపున ఎమ్మెల్సీకి పుష్పగుచ్ఛం అందజేశారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…? - February 25, 2021
- వన్నెల్ (బి)లో పోలీసు కళాజాత - February 25, 2021
- 26లోగా పూర్తి చేయాలి - February 24, 2021