Breaking News

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సోమవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ముందుగా నూతన పురపాలక భవనం స్థలం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ గోడను, పాత అంగడి బజారులో నిర్మిస్తున్న నూతన చేపల మార్కెట్‌ను పరిశీలించారు. పనులు త్వరితంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఎర్రమన్ను కుచ్చ కాలనీలో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళను పరిశీలించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి, పురపాలక సంఘం చైర్మన్‌ జంగం గంగాదర్‌, ఎంపిపి దొడ్ల నీరజా వెంకట్రామి రెడ్డి, జడ్పీటీసీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పీకర్‌ వెంట ఉన్నారు.

Check Also

వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్‌ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్‌ ...

Comment on the article