Breaking News

Daily Archives: January 28, 2021

ప్రారంభానికి సిద్ధం చేశాం…

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నడుస్తున్న ఎల్లారెడ్డి గిరిజన గురుకుల వసతిగహాన్ని నెల రోజుల వ్యవధిలో ఎల్లారెడ్డిలోని సొంత భవనంలో ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్సులో సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో మాట్లాడారు. ఫిబ్రవరి 1న జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గహాలు ప్రారంభానికి సిద్ధం చేశామని చెప్పారు. 9,10 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పాఠశాలకు పంపడానికి అనుమతి పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఒంటిమామిడి ...

Read More »

పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ విస్తరణ అధికారులు పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. గురువారం ఆయన టెలి కాన్ఫరెన్సులో వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. ఫిబ్రవరి 3 లోగా వంద శాతం పంటల నమోదు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతు వేదికలను రైతు బంధు కమిటీల కన్వీనర్లతో చర్చించి ఎమ్మెల్యేలతో త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. రైతు బీమా సెటిల్మెంట్లు పెండింగ్‌ లేకుండా చూడాలని కోరారు. క్లస్టర్ల వారీగా వ్యవసాయ అధికారులు ...

Read More »

చిరుధాన్యాలైన కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి

డిచ్‌పల్లి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి పరిస్థితుల్లో చిరుధాన్యాలు తినడం వలన మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వాటిపైన చైనాలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్త డా. ఎమ్‌ రామకష్ణన్‌ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం ”జీవశాస్త్రములో సరికొత్త పోకడలు” అనే అంశంపై రెండవ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు జరిగింది. సదస్సులో ఆయన మాట్లాడుతూ జన్యుశాస్త్రమునుపయోగించి కొర్రల్లో వివిధ జన్యురూపాలను ఏ విధంగా తయారు చేయవచ్చు మరియు వాటి వలన కలిగే లాభాలు తదితర ...

Read More »

29న మంత్రి పర్యటన వివరాలు

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 29వ తేదీ శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ ఎక్స్‌ రోడ్‌ నేషనల్‌ హైవే నుండి అంబెడ్కర్‌ విగ్రహం వరకు 4 లైన్లుగా మార్చే ఆర్‌.అండ్‌.బి రోడ్‌ (6.50 కోట్లు) పనుల ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9.30 గంటలకు 90 లక్షలతో చెప్పట్టబోయే అంబేద్కర్‌ విగ్రహం నుండి పోచమ్మగల్లీ బాల్కొండ రింగ్‌ రోడ్డు బిటి పనుల ...

Read More »

ఉపాధి ప‌నుల‌పై కేంద్ర బృందం సంతృప్తి

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి / ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాయింట్‌ సెక్రటరీ రోహిత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కేంద్ర బందం జిల్లాలో పర్యటించి ఉపాధి హామీ పనులను పరిశీలించారు. గురువారం కేంద్ర బందం పర్యటనలో భాగంగా వేల్పూర్‌ మండలంలో పర్యటించారు. అమరేందర్‌ ప్రతాప్‌ సింగ్‌ డైరెక్టర్‌ ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ, కార్తీక్‌ పాండే టెక్నికల్‌ , రఘునందన్‌ రావు ఐఏఎస్‌, కమిషనర్‌ / పిఆర్‌ అండ్‌ ఆర్‌డి (తెలంగాణ) సైదులు ఐఎఫ్‌ఎస్‌, స్పెషల్‌ కమిషనర్‌ ఆర్‌డి, వి.ఎన్‌ఎస్‌ ప్రసాద్‌ ఐఎఫ్‌ఎస్‌, ...

Read More »

ఉపాధిహామీ కూలీల పిల్లలకు శిక్షణ ఉద్యోగాలపై సంతప్తి

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంద రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న ఉపాధిహామీ కూలీల పిల్లలకు శిక్షణతో పాటు ప్రైవేట్‌లో ఉద్యోగాలు కల్పించడంపై ఎంజిఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కేంద్ర సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి / ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాయింట్‌ సెక్రటరీ రోహిత్‌ కుమార్‌ సంతప్తి వ్యక్తం చేశారు. గురువారం నిఖిల్‌ సాయి హోటల్‌లో ఏర్పాటు చేసిన కూలీలు వారి పిల్లలతో ముఖా ముఖి కార్యక్రమంలో ఆయన తన బంద సభ్యులతో పాల్గొన్నారు. అమరేందర్‌ ప్రతాప్‌ సింగ్‌ డైరెక్టర్‌ ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ, కార్తీక్‌ పాండే ...

Read More »

31న పల్స్‌ పోలియో

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రామారెడ్డి ప్రభుత్వా దవాఖానలో ఏఎన్‌ఎం లకు, అంగన్‌ వాడి టీచర్స్‌, వలంటరీస్‌కి వైద్యాధికారి డాక్టర్‌ షాహీద్‌ అలీ పల్స్‌ పోలియోపై అవహగహన కల్పించారు. ఈనెల 31వ తేదీ ఆదివారం ఆసుపత్రి పరిధిలో గల రామారెడ్డి -ఎ, రామారెడ్డి-బి, ఇస్సన్నపల్లి, ఉప్పల్‌ వాయి, గిద్ద, పోసానిపెట్‌, వడ్లూర్‌ ఎల్లారెడ్డి, సబ్‌ సెంటర్‌లలో పల్స్‌ పోలియో కార్యక్రమం చేపట్టనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. పల్స్‌ పోలీయో కార్యక్రమం 31 జనవరి నుండి ఫిబ్రవరి 2వ తేదీ ...

Read More »

తేనె సాయి మందిరంలో ఉచిత వైద్య పరీక్షలు

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని తేనె సాయి మందిరంలో గురువారం మెడి కవర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పర్షీలు నిర్వహించారు. ప్రతి గురువారం సాయి ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా బిపి, షుగర్‌ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కో ఆర్డినేటర్‌ భరత్‌ పేర్కొన్నారు. సుమారు 60 నుంచి 80 మంది వరకు ప్రతి గురువారం పరీక్షలు నిర్వహించుకుంటారని అన్నారు. కార్యక్రమంలో నర్సింగ్‌ సిబ్బంది శ్రావణి, భూమిక పాల్గొన్నారు.

Read More »