నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శారీరక శ్రమ లేకపోవడం ఆహారపు అలవాట్లలో మార్పు నిద్రలేమి తదితర కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గ్రేసీ స్వచ్ఛంద సంస్థ అందజేసిన క్యాన్సర్ పరీక్షల మొబైల్ వాహనాన్ని స్థానిక ఇందూరు క్యాన్సర్ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ప్రజలు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని తీసుకుంటూ శారీరక శ్రమతో పాటు నడక మంచి ...
Read More »Daily Archives: January 30, 2021
జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారిగా రజిత
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారిగా రజిత శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఆమె జగిత్యాల జిల్లా ఏఎస్డబ్ల్యూవో గా పనిచేసి పదోన్నతిపై కామారెడ్డికి వచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ని శనివారం ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
Read More »పల్స్పోలియోకు సర్వం సిద్ధం
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం సన్నాహక ఏర్పాట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్ పర్యవేక్షించారు. శనివారం పట్టణ ఆరోగ్య కేంద్రం, రాజీవ్ నగర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రామరెడ్డి, అన్నారం, మాచారెడ్డిలో సందర్శించారు. పల్స్ పోలియోలో పాల్గొనే సిబ్బందికి, నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని 5 సంవత్సరా ల లోపు ప్లిను 1 లక్ష 3 వేల 980 లక్ష్యంగా ...
Read More »ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఏబి ప్లేట్ లెట్స్ అందజేత
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో శ్యామ్ రెడ్డి 45 సంవత్సరాల వయసు కలిగిన బసన్న పల్లి గ్రామానికి వ్యక్తికి ఏబి పాజిటివ్ ప్లేట్లెట్స్ పడిపోవడంతో అత్యవసరంగా వారికి కావలసిన ప్లేట్లెట్స్ను పట్టణానికి చెందిన నవజీవన్ వైద్యశాల ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సృజన్ రెడ్డి, లిఖిత డయాగ్నొస్టిక్ సెంటర్ జిల్లా ఇంచార్జ్ నాగరాజు మానవతా దృక్పథంతో స్పందించి ఏబి పాజిటివ్ స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో అందజేయడం జరిగిందని, వీరికి కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు ...
Read More »అమరవీరులకు ఘన నివాళి
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు, ప్రగతి భవన్ లోని శాఖల అధికారులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కోసం ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమములో అడిషనల్ ...
Read More »యానంపల్లిలో పోలీసు కళాజాత
డిచ్పల్లి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యానంపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ముఖ్యంగా ఆన్లైన్ మోసాల గురించి జాగ్రత్త వహించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, లేకుంటే ప్రయాణం చేయొద్దని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సమస్యలకు పరిష్కార ...
Read More »