Breaking News

రెండోరోజు పల్స్‌పోలియో

కామారెడ్డి, ఫిబ్రవరి 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలోని గ్రామాల్లో రెండవరోజు పల్స్‌ పోలియో విజయవంతంగా నిర్వహించారు. రామరెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల‌ రామరెడ్డి ఎ, బి, ఇస్సన్నపల్లి, పోసానిపెట్‌, కన్నపూర్‌, గిద్ద, ఉప్పల్‌ వాయి, తిర్మన్‌ పల్లి, వడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామాల్లో రెండవ రోజు పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించారు.

ఇంటింటికి తిరుగుతూ ఆదివారం ఎవరైతే పోలియో చుక్కలు వేయించుకోలేదో వారిని గుర్తించి చుక్క మందు అందించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది భీమ్‌, విమలాభారతి, ల‌లిత, చంద్రకళ, మహేశ్వరి, జ్యోతి, గంగమని, స్వరూప రాణి, అంగన్‌వాడి టీచర్లు, ఆశలు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article