Breaking News

బెల్లాల్‌ చెరువులో అనుమానాస్పదంగా మృతదేహం

బోధన్‌, ఫిబ్రవరి 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గౌడ్స్ కాల‌నీకు చెందిన రఘుపతి ప్రశాంత్‌ (అలియాస్‌) రాజు అనే యువకుడు జనవరి 29 శుక్రవారం సాయంత్రం నుండి కనబడకుండాపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం బోధన్‌ బెలాల్‌ చెరువులో గుర్తుతెలియని మృతదేహం ఉందని సమాచారం రావడంతో ప్రశాంత్‌ తల్లిదండ్రుల‌కు సమాచారం ఇచ్చారు.

ప్రశాంత్‌ తలిదండ్రులు మృతదేహాన్ని చూసి ప్రశాంతేనని నిర్దారించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రశాంత్‌ మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విల‌పిస్తు తమ కుమారుని చావుకు పాత కక్షలే కారణమని అన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article