Breaking News

పోలీసు కుటుంబానికి ఆర్థిక సాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత సంవత్సరం ఆగష్టు 15వ తేదీన సి. హెచ్‌. రమేష్‌ పి.సి : 204 పి.యస్‌ రెంజల్‌ అనారోగ్యంతో మరణించారు.

కాగా పోలీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అతని కుటుంబానికి నిజామాబాద్‌ పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌ నుండి పోలీస్‌ కమీషనర్‌ వరకు తమ జీతం నుండి డెత్‌ ఫండ్‌ (ఆర్థిక సహయం) రూపంలో గ చెక్కు 1 ల‌క్ష 23 వేల 200 రూపాయలు మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాల‌యంలో అదనపు పోలీస్‌ కమీషనర్‌ (లా అండ్‌ ఆర్డర్‌) వి. అరవింద్‌ బాబు చేతుల ‌మీదుగా కీర్తి శేషులు సి. హెచ్‌. రమేష్‌ సతీమణి అయిన సి. హెచ్‌. శారదకి అందజేశారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఎ.సి.పి ఆర్‌. ప్రభాకర్‌ రావ్‌, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు షకీల్‌ పాషా, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article