Breaking News

జాతీయస్థాయిలో నిజామాబాద్‌ నామినేషన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020లో క్షయ నియంత్రణలో నిజామాబాద్‌ జిల్లా జాతీయ స్థాయిలో నామినేషన్‌ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర డబ్ల్యుహెచ్‌వో ప్రతినిధి డాక్టర్‌ స్నేహ శుక్ల, రాష్ట్ర ఎసిడయాసిస్ట్‌ సుమల‌త మంగళవారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి డాక్టర్‌ సుదర్శన్‌ మాట్లాడుతూ తెలంగాణ నుండి కేవలం నాలుగు జిల్లాలుఎంపిక చేయగా అందులో నిజామాబాద్‌ జిల్లా ఉండడం గౌరవంగా ఉందన్నారు. ఇందుకోసం రాబోయే వారం రోజుల్లో కొన్ని గ్రామాల‌ను సెంట్రల్‌ టిబి డివిజన్‌ వారి ఆదేశాల‌ మేరకు ఇంటింటి సర్వే నిర్వహించబోతున్నామన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా పేరు తెచ్చుకొనే కార్యక్రమాన్ని రూపుదిద్దుతామని ఆయన తెలిపారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article