Breaking News

చెక్‌ డ్యాం నిర్మాణ పనుల‌కు శంకుస్థాపన చేసిన స్పీకర్‌, మంత్రి

బాన్సువాడ, ఫిబ్రవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ సరిహద్దులో మంజీర నదిపై రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్‌ డ్యాం నిర్మాణ పనుల‌కు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సభాధ్యక్షతలో రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేము ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో జుక్కల్‌ శాసనసభ్యులు హన్మంత్‌ షిండే, కామారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ధఫేదార్‌ శోభ రాజు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌, మండలాధ్యక్షురాలు దొడ్ల నీరజా వెంకట్రామిరెడ్డి, జిల్లా పరిషత్‌ సభ్యురాలు పద్మ గోపాల్‌ రెడ్డి, బాన్సువాడ పురపాల‌క సంఘ చైర్మన్‌ జంగం గంగాధర్‌, బాన్సువాడ పిఏసిఎస్‌ అధ్యక్షుడు ఎర్వ కృష్ణారెడ్డి, బాన్సువాడ ఏఎంసి చైర్మన్‌ పాత బాల‌కృష్ణ, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ దుద్దా అంజిరెడ్డి, తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి, భూషణ్‌ రెడ్డి, రైతు, స్థానిక ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్‌ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్‌ ...

Comment on the article