Breaking News

సిసి రోడ్డు పనులు ప్రారంభం

బోధన్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం సాలూర గ్రామంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధుల‌ ద్వారా వికర్‌ సెక్షన్ కాల‌నీలో 5 ల‌క్షల‌ రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనుల‌ను ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్‌ ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ సాలూరా గ్రామ అభివృద్ధికి ఎల్ల‌వేళల‌ సహాయ సహకారాలు అందిస్తున్న ఎంఎల్‌సి కవితకి, శాసన సభ్యులు షకీల్‌ ఆమెర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఎంపీటీసీ కండే సవిత సంజీవ్‌, ఉప సర్పంచ్‌ సరిడే సాయిలు, వార్డు మెంబర్‌ రాజు, రైసస మాజీ కోర్దినేర్‌ బుద్దే రాజేశ్వర్‌, గ్రామ నాయకులు అల్లె జనార్దన్‌, బి సురేష్‌ పటేల్‌, జి.వి పటేల్‌, శివరాజ్‌ పటేల్‌, శ్రీకాంత్‌ పటేల్‌, ఏ.ఇ. సాయిలు, గ్రామ పంచాయితీ ఇవో రాజీవ్‌ గాంధీ పాల్గొన్నారు.

Check Also

ముమ్మరంగా సాగుతున్న సభ్యత్వ నమోదు

బోధన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బోధన్‌ మండలం సాలూర గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ...

Comment on the article