పీడితుల‌ పక్షాన కల‌మెత్తిన వ్యక్తి మొయినుద్దీన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం తెలంగాణ జాగృతి నిజామాబాద్‌ ఆద్వర్యంలో మొయినుద్దిన్‌ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా కన్వీనర్‌ అవంతి రావు మాట్లాడుతూ మెదక్‌ జిల్లా ఆందోల్‌ లో 1908 ఫిబ్రవరి 4న జన్మించారని, తాను కమ్యూనిస్టు ఉద్యమానికి జీవితం అంకితం చేశారని పేర్కొన్నారు. ప్రగతిశీల‌ బావాల‌తో పీడీతుల‌ పక్షాన కల‌మెత్తి, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారన్నారు.

కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్‌ ఆపర్ణ, జిల్లా కో కన్వీనర్‌ పులి జైపాల్‌, జిల్లా అధికార ప్రతినిధి పంచ రెడ్డి మురళి, జిల్లా పిఆర్‌వో హరీష్‌ యాదవ్‌, సందీప్‌, రంజిత్‌, అజాం, రమేష్‌, శ్రీహ‌రి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ...

Comment on the article