Breaking News

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణం మరియు బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌, దేశాయిపేట, పోచారం గ్రామాల‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల‌ను గురువారం శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.

ముందుగా తాడ్కోల్‌ గ్రామంలోని అంబేడ్కర్‌ భవనాన్ని పరిశీలించారు. అనంతరం బాన్సువాడ పట్టణంలో నిర్మిస్తున్న ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని పరిశీలించి నిర్మాణ పనుల‌పై ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల‌తో మాట్లాడారు.

అనంతరం దేశాయిపేట గ్రామంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను పరిశీలించి, నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రారంభించి ల‌బ్ధిదారుల‌కు అందజేస్తామని స్పీకర్‌ తెలిపారు. అనంతరం పోచారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని పరిశీలించి పనులు అనుకున్న ప్రకారం జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article