Breaking News

7న ఆధ్యాత్మిక చింతన మౌన శిబిరం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు ఆర్యసమాజము ఆధ్వర్యంలో 7వ తేదీ ఆదివారం ఆధ్యాత్మిక చింతన మౌన శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఒకప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల‌ వరకు యోగ, ధ్యానం, సంధ్య, యజ్ఞం, ఆధ్యాత్మిక చింతన ప్రవచనములు, ఆధ్యాత్మిక చింతన మననం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు.

sa

శిబిరంలో పాల్గొనదచిన వారు పూర్తిగా మౌనం పాటించాల‌ని, అప్పుడే దివ్యమైన అనుభూతిని పొందగలుగుతారన్నారు. అలాగే సెల్‌ఫోన్‌ రోజంతా స్విచ్‌ ఆఫ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. నిత్యవసర వస్తువులు వెంట తెచ్చుకొని రావాల‌ని సూచించారు.

Check Also

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ...

Comment on the article