Breaking News

తెలంగాణ దీపస్తంభం వట్టికోట ఆళ్వారుస్వామి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ సాహిత్యానికి దీపస్తంభం అని హరిదా రచయితల‌ సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కేర్‌ డిగ్రీ కళాశాల‌లో జరిగిన వట్టికోట ఆల్వార్‌ స్వామి వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

జిల్లా జైలులో డాక్టర్‌ దాశరథితో కలిసి వట్టికోట ఆళ్వార్‌ స్వామి శిక్ష అనుభవించడం, జైలులో కూడా ధిక్కార స్వరాన్ని వినిపించడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో స్ఫూర్తిదాయక ఘట్టం అని ఆయన అన్నారు. ఆయన రచించిన జైలు లోపలి కథలు, ప్రజల‌ మనిషి నవల‌, గంగు నవల తెలంగాణ సాహిత్య చరిత్రలో తెలంగాణ సంస్కృతికి పట్టం కట్టిన రచనల‌ని దేవేందర్‌ వివరించారు.

తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం వట్టికోట జీవితాన్ని త్యాగం చేశారని నివాళుల‌ర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల‌ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల ‌సుధాకర్‌, తంగళ్ళపల్లి నరేశ్‌, మద్దుకూరు సాయిబాబు, కేర్‌ కళాశాల‌ ప్రిన్సిపాల్ బాల‌కృష్ణ, కొయ్యాడ శంకర్‌, తెలుగు ఉపన్యాసకులు ఇరుమ‌ల్ల‌ వినయ్‌ కుమార్‌, సందేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article