Breaking News

దరఖాస్తుల‌ ఆహ్వానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంఘిక సంక్షేమ గురుకుల‌ పాఠశాల‌లు / కళాశాల‌ల్లో పార్ట్‌ టైం ప్రాదిపదికన బోధనకు అర్హులైన అభ్యర్థుల‌ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారిణి అలివేలు ఒక ప్రకటనలో తెలిపారు.

అధ్యాపక ఖాళీల్లో తెలుగు-2, ఆంగ్లం-1, ఫిజిక్స్‌-1, సివిక్స్‌-1, ఉపాధ్యాయుల‌ ఖాళీల్లో పీజీటీ తెలుగు-1, ఆంగ్లం-4, గణితం-4, ఫిజికల్‌ సైన్స్‌-1 ఖాళీలు ఉన్నాయన్నారు. అధ్యాపకుల‌కు నెల‌కు వేతనం రూ.18 వేలు, ఉపాధ్యాయుల‌కు రూ.14 వేలు చెల్లిస్తారన్నారు. అభ్యర్థుల‌ పూర్తి బయోడెటా, విద్యార్హత జిరాక్సు ప్రతుల‌ను ఈ నెల‌ 10లోగా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బీ) లోని ఆర్సీవో కార్యాల‌యంలో అందజేయాల‌ని సూచించారు.

Check Also

ప్రైవేట్‌ ఆస్పత్రుల‌ తనిఖీ

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల‌లో రెమిడెసివర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ ...

Comment on the article