Breaking News

రక్తహీనతతో బాధపడుతున్న యువకుడికి రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ల‌క్ష్మి వైద్యశాల‌లో చిలుక రమేష్‌ ఉప్పల్‌ వాయి గ్రామానికి చెందిన 31 సంవత్సరాల‌ వయసు కలిగిన యువకుడు రక్తహీనతతో బాధ పడుతుడండముతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన సురేష్‌ ముందుకు వచ్చి ఓ పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాల‌ను కాపాడినట్లు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు.

గతంలో చాలాసార్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తాన్ని అందజేసిన రక్తదాత సురేష్‌ను అభినందించారు. రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాల‌ని, అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని అన్నారు. కార్యక్రమంలో వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌, రోగి బంధువులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article