Breaking News

ప్రారంభమైన వ్యాధి నివారణ టీకాల‌ కార్యక్రమం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉచిత పిపిఆర్‌ వ్యాధి నివారణ టీకాల‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం మిర్దాపల్లి, దేగాం గ్రామాల్లో జీవాల‌లో ఉచిత పిపిఆర్‌ టీకాల‌ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో రెండు గ్రామాల‌ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు పాల్గొని జీవాల‌కు మొదట టీకా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రెండు గ్రామాల్లో పశువైద్య సిబ్బంది రాజేశ్వర్‌, సురేష్‌, నాగార్జున కలిసి జీవాల‌కు టీకాలు వేశారని ఆర్మూర్‌ మండల‌ పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌. ల‌క్కం ప్రభాకర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల‌ జీవాల‌ పెంపకందారులు పాల్గొని తమ తమ జీవాల‌కు టీకాలు వేయించుకున్నారు. మంగళవారం ఇదే కార్యక్రమం గగ్గుపల్లి గ్రామంలో కొనసాగుతుందని, గగ్గుపల్లి గ్రామంలోని జీవాల‌ పెంపకందారులు ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

Check Also

ఆర్మూర్‌లో లెక్చరర్ల ధర్నా

ఆర్మూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా పేరుతో అకస్మాత్తుగా విద్యా సంస్థల‌ను మూసివేసి ప్రైవేట్‌ ...

Comment on the article