Breaking News

9న జాబ్‌మేళా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని నిరుద్యోగుల‌కు ఈనెల‌ 9వ తేదీ జిల్లా ఉపాధి కార్యాల‌యములో జాబ్‌ మేళా జరుగుతుందని, ఇట్టి జాబ్‌ మేళాకు హైదరాబాద్‌ నుండి శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్‌ వారు నిజామాబాద్‌ జిల్లాలో 80 సెల్స్‌ రిప్రజంటివ్‌ కోసం ఎంపిక నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి యస్‌. శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్హతలు ఇంటర్‌ ఆ పైన, వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల‌ వరకు, వేతనము 9 వేల‌ 100 రూపాయలు మరియు ఇన్సెంటివ్‌ ఉంటుందన్నారు.

ఆస‌క్తి గల‌ అభ్యర్థులు ఉదయం 10 గంటల‌ నుండి మధ్యాహ్నం లోపు 9వ తేదీన జిల్లా ఉపాధి కార్యాల‌యం శివాజీనగర్‌, నిజామాబాద్‌లో రెండు పాస్పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు, బయోడేటా ఫామ్‌ మరియు ఆధార్‌ కార్డుతో హాజరు కావాల‌ని పేర్కొన్నారు. పూర్తి వివరాల‌కు జిల్లా ఉపాధి కార్యాల‌యం ఫోన్‌ నెం. 08462-224039 9959456793, 9848237987 కి సంప్రదించవచ్చని తెలిపారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article