Breaking News

పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాలు

కామారెడ్డి, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాల‌ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, గొర్రెలు మేకల‌ పెంపకం దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బీబీపేట మండలం తుజల్‌ పూర్‌ లో గొర్రెలు, మేకల‌కు పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిడిలు చెల్లించిన ల‌బ్ధిదారుల‌కు రెండో విడతలో గొర్రెల‌ పంపిణీ చేస్తామని చెప్పారు. రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధంగా ఉండే గొర్రెలు మేకల‌ పెంపకం చేపట్టడంతో ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని సూచించారు. గతంలో జిల్లాలో 1.60 ల‌క్షల గొర్రెలు మేకలు ఉండగా, ప్రస్తుతం 5.70 ల‌క్షల గొర్రెలు, మేకలు ఉన్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎంపిపి బాల‌మణి, సర్పంచ్‌ సుధాకర్‌ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు సుజాత, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రేంకుమార్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఇంద్రా రెడ్డి, మండల‌ రైతు బంధు కన్వీనర్‌ నాగరాజ్‌ గౌడ్‌, జిల్లా గొర్రెలు మేకల‌ పెంపకం దారుల‌ సంఘం అధ్యక్షుడు భూమయ్య, వైద్యాధికారిణి హేమ శ్రీ, గొర్రెలు, మేకల‌ పెంపకం దారుల‌ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

పనుల్లో అలసత్వం వహిస్తే బిల్లులు నిలిపివేస్తాం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కౌలాస్‌ నాలా, నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article