Breaking News

సమాన పనికి సమాన వేతనం కావాలి

బోధన్‌, ఫిబ్రవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారిశుధ్ద్య రంగంలో పని చేస్తున్న కార్మికుల‌ను పాల‌కులు వారి పాదాల‌ను కడిగి ఒకరు, వారు దేవుళ్ళని మరొకరు పొగడ్తతో ముంచెత్తుతున్నారని, వారి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వడం లేదని తెలంగాణ ప్రగతి శీల‌ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర నాయకులు బి మల్లేష్‌ మండి పడ్డారు.

బుధవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణ మున్సిపల్‌ కార్యాల‌యం ముందు తెలంగాణ ప్రగతి శీల‌ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మున్సిపాలిటిలో పనిచేస్తున్న కాంట్రాక్టు / అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరిని పర్మినెంట్‌ చేయాల‌ని, ఎన్‌ఎంఆర్‌ కార్మికుల‌ను రెగ్యుల‌రైజ్‌ చేయాల‌ని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాల‌ని, జీవో 14 ను సవరించి, జీవోలో వున్న కేటగిరీల‌ను అమలు చేయాల‌ని, పీ.ఎఫ్‌,ఈఎస్‌ఐ ను కట్‌ చేసి కార్మికుల‌ ఖాతాల్లో రెగ్యుల‌ర్‌గా జమ చేయాల‌ని, వాటి ద్వారా వచ్చే సదుపాయాలు కార్మికుల‌కు అందేటట్లూ చేయాల‌ని, పని భారాన్ని తగ్గించాల‌ని, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల‌కు కనీస బేసిక్‌ 21 వేలు వుండాల‌ని తదితర డిమాండ్ల సాదనకై ధర్నా నిర్వహించి, మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.

కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు కే రవి, కార్మికులు / ఉద్యోగులు ఖాజీం, శివ, ఎన్‌.సాయులు, ఎం.పొశెట్టి, గోపాల్‌, భూమన్న, గంగారాం, సాయక్క, పార్వతి, గంగామని, సాయక్క, శివమ్మ తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article