Breaking News

స్పీకర్‌కు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 73వ జన్మధినం సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

స్పీకర్‌ అధికార నివాసంలో మంత్రి వేముల‌ స్పీకర్‌కి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ కుటుంబ సభ్యుల‌తో కలిసి కేక్‌ కటింగ్‌ కార్యక్రమంలో మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఎంఎల్‌సి వీజీ గౌడ్‌, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యి, నిజామాబాద్‌ డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, పోచారం సురేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Check Also

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ...

Comment on the article