Breaking News

పట్టభద్రుల‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ఓడించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల‌ను చిత్తుగా ఓడించాల‌ని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ల‌క్షలాది ఉద్యోగాలు వస్తాయని మాయమాటలు చెప్పి మోసం చేశారని రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ ఉద్యోగాల క‌ల్ప‌నలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫల‌మైందన్నారు.

ఇప్పటివరకు గ్రూప్‌ 1, జెఎల్‌, డిఎల్‌, డైట్‌ అధ్యాపకుల‌ నియామకాలు చేయలేదని, రాష్ట్రంలో ల‌క్షలాది ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగులు, విద్యార్థుల ‌జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత కెసిఆర్‌దే అన్నారు. కెసిఆర్‌ కుటుంబంలోని వారికి ఉద్యోగాలు వచ్చాయే తప్ప తెలంగాణలోని నిరుద్యోగుల‌కు ఆశించిన మేరకు ఉద్యోగాలు రాలేదన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల‌కు వయోపరిమితి పెంచితే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థులు అంజల్‌ రెడ్డి, సతీష్‌, అభిలాష్‌, గణేష్‌, ప్రశాంత్‌, భాస్కర్‌, అనిల్‌, బాచంద్రము తదితరులు పాల్గొన్నారు.

Check Also

మే 5 వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌లోని బి.ఎడ్‌. కోర్సుల‌కు ...

Comment on the article