Breaking News

కార్మికుల‌ వేతనాలు పెంచాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులందరికీ వెంటనే వేతనాలు పెంచాల‌ని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, ఎన్‌.ఎం.ఆర్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాల‌ని తదితర డిమాండ్లతో తెలంగాణ ప్రగతిశీల‌ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాల‌యం ముందు ధర్నా నిర్వహించి ఎం.హెచ్‌.వోకి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు వనమాల‌ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో సుమారు 40 వేల‌ మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరందరికీ వేతనాలు పెంచాల్సి వున్నా, కేవలం జిహెచ్‌ఎంసి పరిధిలో మాత్రమే నవంబర్‌ 2020లో వేతనాలు పెంచారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే, మున్సిపల్‌ కార్మికుల‌కు మాత్రం అత్యంత తక్కువ వేతనాలే ఇవ్వడం దారుణమన్నారు.

 

సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులందరితో సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా నాయకులు ఎం.సుధాకర్‌, యూనియన్‌ నాయకులు కే.రాజేశ్వర్‌, గోవర్ధన్‌, వెంకటేష్‌, శాంతికుమార్‌, శ్రీనివాస్‌, జమున, బాబు, ల‌క్ష్మి, పార్వతి, సుజాత, రాధ, యమున, అశుర్‌, చరణ్‌, నర్సింగ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article