Breaking News

ఈనెల‌ 12 నుండి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పాలియేటివ్‌ కేర్‌ ప్రోగ్రాం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిజామబాద్‌లో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేయటానికి ఫిజిషియన్‌ / మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టు ఖాళీలు (1) ఉన్నట్టు జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు విద్యార్హత : ఎం.డి. జనరల్‌ మెడిసిన్‌ లేదా ఎం.బి.బి.ఎస్‌. మరియు పాలియేటివ్‌ సర్టిఫికెట్‌ కోర్సు కలిగి తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ నందు రిజిష్టర్‌ చేయబడి ఉండాల‌న్నారు.

హానరోరియం : రూ. 60 వేలు, 40 వేలు మరియు స్టాఫ్‌ నర్స్‌ పోస్ట్‌ ఖాళీలు (3), విద్యార్హత ఎం.ఎస్‌.సి. నర్సింగ్‌ లేదా బి.ఎస్‌.సి. నర్సింగ్‌ కలిగి ఉండాల‌ని, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ నందు రిజిష్టర్‌ చేయబడి ఉండాల‌ని, హానరోరియం : రూ17 వేల‌ 30 ఉంటుందన్నారు.

దరఖాస్తులు ఈనెల‌ 12 నుండి 18 వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల‌యం, నిజామాబాద్‌, అక్షర ప్రణాళిక భవన్‌, నిజామాబాద్‌ నందు ఉదయం 10.30 గంటల‌ నుండి సాయంత్రం 5 గంటల‌ వరకు స్వీకరించబడునన్నారు. దరఖాస్తు ఫారం వెబ్‌ సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవాల‌ని సూచించారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article