Breaking News

ఏఇవో పదవీ విరమణ

బోధన్‌, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం సాలూర సహకార సంఘ ఆవరణలో సాలూర‌ క్లస్టర్‌కు ఏఇవో గా పనిచేసిన ఎంఏ సత్తార్‌ పదవి విరమణ సన్మాన కార్యక్రమం సాలూర సొసైటి చైర్మన్‌ బి శివకాంత్‌ పటేల్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా వ్యవసాయ ఆధికారి గోవింద్‌, అతిధులుగా ఎంపిపి బుద్దే సావిత్రి రాజేశ్వర్‌, పెంటకలాన్‌ సొసైటి చైర్మన్‌ రాజా రెడ్డి, ఐడిసిఎంఎస్‌ డైరెక్టర్‌ రాజాగౌడ్‌, ఏడిఏ వాజిద్‌ హుస్సేన్‌, బోధన్‌ ఇంఛార్జి ఏడిఏ సంతోష్‌, రైసస మాజీ కో ఆర్డినేటర్‌ బుద్దే రాజేశ్వర్‌, సాలూర సహకర సంఘ పాల‌కవర్గ సభ్యులు, క్లస్టర్‌ గ్రామ పరిధి సర్పంచులు, ఎంపిటిసిలు, ఉప సర్పంచులు, సహకర సంఘ మండల‌ కార్యదర్శులు, మండల‌ ఏఇవోలు, క్లస్టర్‌ గ్రామ పరిధి గ్రామ నాయకులు, రైతులు ప్రజలు పాల్గొని ఘనంగా సన్మానించి ఆయన సేవ‌లు మరవలేనివని కొనియాడారు.

ఈ సందర్బంగా సత్తార్‌ మాట్లాడుతూ మీరందరూ చూపించిన ప్రేమ ఆప్యాయత గౌరవానికి తాను ఎల్ల‌ప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. కార్యకమాన్ని విజయవంతం చేసిన పెద్దలందరికీ సంఘ కార్యదర్శి బి బస్వాంత్‌ రావు పటేల్ కృతజ్ఞతా అభివందనాలు తెలిపారు.

Check Also

ముమ్మరంగా సాగుతున్న సభ్యత్వ నమోదు

బోధన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బోధన్‌ మండలం సాలూర గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ...

Comment on the article