Breaking News

ప్రత్యేక నిధుల‌ అభివృద్ధి పనులు మే చివరికల్లా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక నిధుల‌తో మంజూరు చేసిన పనుల‌న్నీ మే చివరికల్లా పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఇంజనీరింగ్‌ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం క్యాంప్‌ కార్యాల‌యం నుంచి సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారుల‌తో పనుల‌ అభివృద్ధిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సిడిఎఫ్‌, ఎస్‌డిఎఫ్‌, ఎంపీ లాడ్స్‌ తదితర నిధుల‌తో మంజూరు చేసిన పనుల‌ను ఆల‌స్యం చేయకుండా, ఇంకా ఎక్కడైనా ప్రారంభం కాకుండా ఉంటే వెంటనే ప్రారంభించి మే చివరికల్లా తప్పనిసరిగా పూర్తి చేయడానికి ఇంజనీరింగ్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాల‌ని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా స్మశాన వాటికలు పూర్తి చేయటానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల‌ని కలెక్టర్‌ తెలిపారు.

గత సంవత్సర కాలంగా కరోనా ఇతర కారణాల‌వ‌ల్ల‌ అభివృద్ధి అనుకున్నంత మేర జరగలేదని వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు పనుల‌న్నీ పూర్తి చేస్తే ఎటువంటి ఆటంకాలు కలుగవని తెలిపారు. ఎక్కడైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాల‌ని ఆయన అధికారుల‌కు సూచించారు. సెల్‌ కాన్ఫరెన్సులో పంచాయతీ రాజ్‌ ఎస్‌ఇ, ఈఈలు, డీఈలు, ఏఈలు, సిపిఓ శ్రీ రాములు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article