Breaking News

బోధన్‌లో కార్మికుల‌ ధర్నా

బోధన్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో బీడీ కార్మికుల‌కు ఇచ్చిన మాట ప్రకారం బీడీ కార్మికుకులందరికి 2016 రూపాయల‌ జీవన భృతిని ఇవ్వాల‌ని తెలంగాణ ప్రగతి శీల‌ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) బోధన్‌ ఏరియా కమిటి ఆధ్వర్యంలో బోధన్‌ పట్టణంలోని మహాల‌క్ష్మీ మందిర్‌ నుండి ఆర్‌డివో కార్యాల‌యం వరకు ర్యాలీగా వెళ్ళి, కార్యాల‌యం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవోకి జీవన భృతి కై కార్మికుల‌ అప్లికేషన్లు, మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ మాట్లాడుతూ ఎన్నికల‌ సమయంలో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తే బీడీ కార్మికుల‌కు ఇప్పుడీచ్చే వేయి రూపాయల‌ జీవన భృతిని రెండు వేల‌ పదహారు (2016) కు పెంచి,యిప్పటి వరకూ ఇస్తున్న వారికే కాక, 2014 ఫిబ్రవరి కట్‌ ఆఫ్‌ డేట్‌ను తొల‌గించి, పీఎఫ్‌ వున్న ప్రతీ కార్మికురాలికి ఇస్తానని హామీ ఇచ్చారని, వారి మాటను నమ్మి కార్మికులు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేశారని, కాని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ మాట తప్పి కార్మికుల‌కు మోసం చేశాడని ఆందోళన వ్యక్తం చేశారు.

కార్మికులు ఎంతో ఆవేదన చెందుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీలు చేసే ప్రతీ కార్మికురాలికి 2016 రూపాయల‌ జీవన భృతిని వెంటనే ఇవ్వాల‌ని‌ లేని యెడల‌ బీడీ కార్మికుల‌తో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామనీ హెచ్చరించారు. కార్యక్రమంలో కే.రవి, సి.హెచ్‌ గంగయ్య, ఏరియా కమిటి నాయకులు గంగామని, సావిత్రి, ల‌క్ష్మి, రేణుక, అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.

Check Also

ముమ్మరంగా సాగుతున్న సభ్యత్వ నమోదు

బోధన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బోధన్‌ మండలం సాలూర గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ...

Comment on the article