Breaking News

ప్రశ్నించే వారే వినియోగదారులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండించే వారే రైతులు, పోరాడే వారే సైనికులు, ప్రశ్నించే వారే వినియోగదారులు అని తెలంగాణ వినియోగదారుల‌ ఫోరం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కన్వీనర్‌, కో-కన్వీనర్‌ తాళ్లపల్లి రాజు, ధర్మపురి శ్రవణ్‌ అన్నారు. ఈ మేరకు స్థానిక శ్రీ చైతన్య పాఠశాల‌లోని విద్యార్థుల‌కు వినియోగదారుల‌ చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడైతే ప్రతిఒక్క వినియోగదారుడు తన హక్కుల‌ను తెలుసుకుని కొనుగోలు చేసే ప్రతి ఒక వస్తువు నాణ్యత లోపాలు, ఎమ్మార్పీ ధరల‌ను పరిశీలించి ప్రశ్నిస్తారో అపుడే తనకు తానుగా న్యాయం చేసుకోగలుగుతాడని అన్నారు. అన్యాయం జరుగుతున్న ప్రతీ వినియోగదారుడికి న్యాయం జరిగే దిశగా తెలంగాణ వినియోగదారుల‌ ఫోరం ఎల్ల‌వేళలా పయనిస్తుందని తెలిపారు.

అనంతరం నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎల్‌.ఎన్‌.చారి విద్యార్థుల‌కు వినియోగదారుల‌ చట్టాలు, వాటిని వినియోగించుకునే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య హై స్కూల్‌ డీన్‌ సందీప్‌, 10వ తరగతి ఇంచార్జి జీవన్‌ రెడ్డితో పాటు పాఠశాల‌ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ...

Comment on the article