Breaking News

భక్తుల‌తో కిట కిటలాడిన లింబాద్రి గుట్ట

భీమ్‌గల్‌, ఫిబ్రవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల‌ క్షేత్రం శనివారం రోజు ఉదయం 6 గంటల‌ నుండి దర్శనాల‌ రద్దీ ప్రారంభమైంది. కరోన తర్వాత రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది.

శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల‌ తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తుల‌కు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అల్పాహారం (పులిహోర) అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు.

Check Also

లింబాద్రి ల‌క్ష్మీనర్సింహస్వామి ఆల‌యం తరఫున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ ...

Comment on the article