25న రైతు గర్జన సభ

బోధన్‌, ఫిబ్రవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ధర్నా చౌక్‌లో ఈ నెల‌ 25న జరిగే రైతు గర్జన సభకు రైతుల‌తో పాటు కార్మికులు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల‌ని సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి మల్లేష్ పిలుపు నిచ్చారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం పోచారం, రెంజల్‌ మండలం దూపల్లి గ్రామాల్లో భవ‌న నిర్మాణ కార్మికుల‌తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్రంలో మోడి నాయకత్వంలోని బీజేపీ పార్టీ కొత్తగా తెచ్చిన నూతన సాగు చట్టాల‌ను, కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లును రద్దుచేయాలంటూ, రైతులు సాగు చేసుకుంటున్న అటవీ, బంజర భూముల‌కు పట్టాల‌ను ఇవ్వాలంటూ ఈ నెల‌ 25 న సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కమిటీ, ఏఐకేఏంఎస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే రైతు గర్జన సభకు కార్మికులు, కర్షకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల‌ని మల్లేష్ పిలుపునిచ్చారు.

సమావేశానికి కే.రవి అధ్యక్షత వహించారు. సమావేశంలో అంబదాస్‌, గంగారాం, సాయులు, పొశెట్టి, శ్రీను, రాము, రమేశ్‌, సురేశ్‌, సంతోష్‌, భూమయ్య, అబ్బయ్య, రాము, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

న్యాయవాదుల‌ విధుల‌ బహిష్కరణ

బోధన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైకోర్ట్‌ న్యాయవాదుల‌ను క్రూరంగా హత్య చేసిన వారిని కఠినంగా ...

Comment on the article