Breaking News

ఆర్మూర్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా గిరిజన మోర్చా ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాల‌ను ఘనంగా నిర్వహించారు. జంబీహానుమాన్‌ మందిరం నుండి ఎంఆర్‌ గార్డెన్స్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సేవాలాల్‌ మహరాజ్‌ చిత్రపటానికి పూల‌మాల‌లువేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు నూతు శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్మూర్‌ పట్టణ గిరిజన మోర్చా అధ్యక్షుడు పీర్‌ సింగ్‌, జిల్లా మాజీ గిరిజన మోర్చా అధ్యక్షుడు గంగాధర్‌, ఆర్మూర్‌ పట్టణ, మండల‌ శాఖ అధ్యక్షు జెస్సు అనిల్‌, రోహిత్‌ రెడ్డి, ఎంపిటిసిలు రాజ్‌ కుమార్‌, శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్‌ కొంతం మురళి, ద్యగా ఉదయ్‌, అందపూర్‌ రాజేష్‌, బీజేవైయం పట్టణ, మండల‌ నాయకులు, ఆర్మూర్‌ పట్టణ, మండలాల‌కు సంబంధించిన వివిధ మోర్చాల‌ అధ్యక్షులు, ఉపాదక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

ఆర్మూర్‌లో లెక్చరర్ల ధర్నా

ఆర్మూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా పేరుతో అకస్మాత్తుగా విద్యా సంస్థల‌ను మూసివేసి ప్రైవేట్‌ ...

Comment on the article