Breaking News

ఆర్మూర్‌లో ఛత్రపతి శివాజీ జయంతి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు జెస్సు అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్‌ 391 వ జయంతిని ఆర్మూర్‌ లోని శివాజీ చౌక్‌ (గోల్‌ బంగ్లా) వద్ద ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూల‌మాల‌లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి అల్జాపూర్‌ శ్రీనివాస్‌, బిజెపి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ చత్రపతి శివాజీ ‘‘హిందూ పద పాద్షాహి’’ అని ఈరోజు హిందూ ధర్మం, హిందు సంస్కృతి కాపాడి మనుగడ సాగిస్తున్నాయి అంటే దానికి కారణం చత్రపతి శివాజీ అని, నాడు కొందరు మతోన్మాదులు హిందూ ధర్మాన్ని నిర్మూల‌న చేసే ప్రయత్నం చేశారని, దాన్ని తిప్పి కొట్టి హిందూ ధర్మాన్ని శివాజీ కాపాడారన్నారు.

అదేవిధంగా నేడు నరేంద్ర మోడీ కూడా శివాజిని ఆదర్శంగా పాటిస్తూ ‘‘సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ సబ్‌ కా విశ్వాస్‌’’ అనే సిద్దాంతంతో భారత దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అంతేకాకుండా ప్రపంచంలో హిందూ దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే అన్నారు. ఈ దేశంలో హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో మోడీ ఎంతో కృషి చేస్తున్నారని కావున కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి భారతీయులు ఐకమత్యంగా ఉండి హిందూ ధర్మాన్ని కాపాడుకోవల‌సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దోల్ల‌ గంగారెడ్డి, బిజెపి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పుప్పాల‌ శివరాజ్‌, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి, ఆర్మూర్‌ అసెంబ్లీ ఇంచార్జ్‌ వినయ్‌ రెడ్డి, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల‌ శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ద్యాగ ఉదయ్‌, బిజెపి ఆర్మూర్‌ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆకుల‌ రాజు, దుగ్గి విజయ్‌, బిజెపి, వివిధ మోర్చాల‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎస్‌ఆర్‌ఎస్‌పి దుర్ఘటన విచారకరం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఎస్‌ఆర్‌ఎస్‌పి పుష్కర ఘాట్‌ను రాష్ట్ర రోడ్లు మరియు ...

Comment on the article