Breaking News

లింబాద్రిలో భక్తుల‌ రద్దీ

భీమ్‌గల్‌, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల‌ క్షేత్రం శనివారం రోజు ఉదయం 6 గంటల‌ నుండి దర్శనాల‌ రద్దీ ప్రారంభమైంది. కరోన తర్వాత రోజు రోజుకు భక్తుల‌ తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు.

6 గంటల‌ తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల‌కు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అల్పాహారం (పులిహోర) అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు.

Check Also

జిల్లా ప్రజల‌కు మహాశివరాత్రి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రోడ్లు-భవనాలు, గ ృహనిర్మాణ, ...

Comment on the article