ముమ్మరంగా సాగుతున్న సభ్యత్వ నమోదు

బోధన్‌, ఫిబ్రవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బోధన్‌ మండలం సాలూర గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగ కొనసాగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల‌కు ఆకర్షితులై మహిళలు, యువకులు, రైతులు ఎక్కువగా సభత్వాలు తీసుకుంటున్నారని మాజీ రైతు బంధు కో ఆర్డినేటర్‌ బుద్దె రాజేశ్వర్‌ అన్నారు. బోధన్‌ శాసనసభ్యులు ఎండీ. షకీల్‌ ఆమేర్‌ బోధన్‌ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు.

తెరాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి దేశంలో లేని అనేక సంక్షేమ పథకాలు కల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబారక్‌, ఆసరా పెన్షన్‌, వికలాంగుల‌ పెన్షన్‌, రైతు బంధు ద్వారా పెట్టుబడి కొరకు 10 వేలు, ఉచిత విద్యుత్తు, కెసిఆర్‌ కిట్‌ లాంటి పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షుడు శివకాంత్‌ పటేల్‌, కండె సంజీవ్‌, పంచాయతీ మెంబెర్‌ టన్నే, పోశెట్టి, డైరెక్టర్‌ మేత్రి లింబయ్య, చంటి, లింబూర్ ల‌క్ష్మణ్‌ చందూర్‌ సాయరెడ్డి, మోండూర్ ల‌క్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జనావాసాల‌ వద్ద మాంసం వ్యర్థాలు

బోధన్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ లోని 29వ వార్డులో గల‌ మొచ్చిగల్లీ పక్కన ...

Comment on the article