Breaking News

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి 26 వార్డ్‌ లో సోమవారం మున్సిపల్‌ నిధులు రూ.25 ల‌క్షల‌తో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ముఖ్య అతిధిగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి పాల్గొన్నారు.

వార్డులోని అన్ని కాల‌నిలో సీసీ రోడ్లు, మురికి కాలువ‌ల‌ నిర్మాణానికి 100 శాతం అభివృద్ధి కృషి చేస్తానని వార్డు కౌన్సిల‌ర్‌ హన్మండ్ల మానస సురేష్‌ తెలిపారు. వార్డ్‌ సమస్యను చైర్‌ పర్సన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ ఇందు ప్రియ, కాల‌నీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article