నిజామాబాద్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నందర్చంగా పలు అంశాలపై చర్చించారు. 11 వర్దికల్ వ్యవస్థ గురించి క్షుణ్ణంగా చర్చించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సి.సి.టి.ఎన్.ఎస్ (కైమ్ క్రిమినల్ ట్రాకింక్ నెట్వర్కింగ్ సిస్టం) యందు పోలీస్ స్టేషన్‌లోని ఎఫ్.ఐ.ఆర్ / కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందపర్చాలని సూచించారు.
నిజామాబాద్‌లోని పోలీస్ స్టేషన్ల వారిగా పెండింగ్‌లో ఉన్న కేసులను క్షుణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు చేశారు. ఇప్పటి వరకుజరిగిన నేరాలలో త్వరితగతిన పరిశోధన పూర్తిచేసి పెండింగ్ నేరాల శాతం తగ్గించాలని సూచించారు. ఎటువంటి చిన్న నేరాలు జరుగకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వ్యవస్థ పటిష్ట పర్చడం, అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేయడం, బీట్ ఏర్పాటు, రాత్రి సమయాలలో వాహనాల తనిఖీ చేసి దొంగతనాల నివారణకు కృషి చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఆటోలో, జీపులో సామర్య్యానికి మించి ప్యాసింజర్లను ఎక్కకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, కోర్టులో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా కృషిచేయాలని చెప్పారు. పెండిరగ్లో ఉన్న ఎన్.బి.డబ్ల్యూస్పై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్స్ ఏర్పాటుచేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు మరియు లాడ్జీలో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయాలని తెలిపారు.
మోటారు వాహనాల యాక్టు ప్రకారంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు మరియు భవిష్యత్తులో తీసుకోవల్సిన చర్యల గురించి, పెండింగ్ చలానాలు కట్టేవిధంగా చర్యలు తీసుకోవడం, గ్రామాలలో పోలీస్ కళాబృందాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించడం, అలవాటుపడిన నేరస్థులపై పి,డి యాక్టు నమోదు, డయల్ 100 ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలన్నారు.
విడియో కాన్ఫరెన్సులో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయా, ఐ.పి.యస్., నిజామాబాద్, అదనవు డి.సి.పి (లా అండ్ ఆర్డర్) అరవింద్ బాబు, నిజామాబాద్ అదనవు డి.సి.పి (అడ్మిన్), ఉషా విశ్వనాధ్. టి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఎ.సి.పిలు జి. శ్రీనివాస్ కుమార్, రఘు, ఎన్. రామారావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ వర్చికల్ ఇంచార్జీలు, సి.సి.ఆర్.బి, ఇన్స్పెక్టర్ రాజరాజేశ్వర్, ఐ,టి కోర్ ఎస్.ఐ ఆంబ్రియ సిబ్బంది శివకుమార్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021