Breaking News

కలెక్టర్‌ సహకారంతోనే ఒత్తిడి లేని విధులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళిక శాఖ సంచాల‌కులుగా పదోన్నతిపై వెళుతున్న ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీరాములును జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఇతర అధికారులు శాలువాతో సత్కరించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక నిధుల‌ సమావేశం అనంతరం కలెక్టర్‌ ఆయనను సత్కరించిన సందర్బంగా సిపిఓ మాట్లాడారు.

ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు సల‌హాలు అందిస్తూ పూర్తి సహకారం అందించాల‌ని తద్వారానే తాను ఒత్తిడిలేని విధుల‌ను నిర్వహించ గలిగానని అందుకు ఎల్ల‌ప్పుడు కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. ఇంతకాలంగా తనకు సహకరించిన అధికారుల‌కు, ప్రజాప్రతినిధుల‌కు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన స్థానంలో శ్రీనివాస రావు సిపిఓ గా జిల్లాకు రానున్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article