నిజామాబాద్, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి కాలం సమీపిస్తున్న దృష్ట్యా ఏ ఒక్క హేబిటేషన్‌లో కూడా త్రాగునీటి సమస్య ఉండకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశం మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి వేసవికాలం ప్రారంభం అవుతుందని తాగునీటికి సంబంధించి ముందస్తు ప్రణాళిక చేసుకోవాలన్నారు. మిషన్ భగీరథ టీం విజయవంతంగా అన్ని స్టేషన్లో వాటర్ ఇస్తున్నారని ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని తెలిపారు. గత సంవత్సరం సింగూర్‌లో వాటర్ లేకున్నా కోవిడ్ ఉన్నా కూడా మంచి నీళ్లు ఇచ్చామన్నారు.
ఈసారి అన్నీ రిజర్వాయర్‌లో నీళ్లు ఉన్నాయన్నారు. మన టార్గెట్ ప్రతి ఒక్కరికి 100 లీటర్లు ఇస్తామని మాట ఇచ్చాం, పీక్ సమ్మర్లో వాటర్ లేదు అనకుండా ముందస్తు ప్లాన్ చేసుకోవాలన్నారు. ఇందుకు ప్లాన్ ఆఫ్ ఆక్షన్ ఉండాలన్నారు. గ్రౌండ్ లెవల్లో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు.
వేసవి కాలంలో మా వూరిలో వాటర్ మాకు రాలేదు అని చిన్న మాట రావద్దని, వాటర్ లేక ఇబ్బంది పడుతున్నాం అనే మాట రాకూడదని అది మన టార్గెట్ అన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లత, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, మిషన్ భగీరథ ఎస్ఈ రాజేంద్ర కుమార్, ఆర్మూర్. బోధన్. భీంగల్ మున్సిపల్ కమిషనర్లు మిషన్ భగీరథ డిఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021