Breaking News

ఎమ్మెల్యే బగ్గీ టూర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల‌ మునిసిపల్‌ కార్యాల‌యంలో ఎల‌క్ట్రికల్‌ వాహనాన్ని (బగ్గీ) ని ప్రారంభించారు. అనంతరం నగరంలో బగ్గీని స్వయంగా నడుపుకుంటు వెళ్లి రోజువారీ పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిజామాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు భూగర్భ మురికి కాలువ నిర్మాణ పనులు రాత్రి వేళల్లో అధికారుల‌తో కలిసి పరిశీలించిన విషయం తెలిసిందే.

అదే విధంగా నగరంలో ప్లాంటేషన్‌, సెంటర్‌ మీడియంలు, నిరంతరం వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, స్వీపింగ్‌ యంత్రాల‌ని కూడా కొనుగోలు చేయడం జరిగిందని, వీటి పరిశీల‌నకు ఎల‌క్ట్రికల్‌ వాహనాన్ని మునిసిపల్‌ నిధుల‌తో కొనుగోలు చేసినట్టు తెలిపారు. వాహనం లో 11 నుండి 12 మంది కూర్చొనే సౌకర్యంతో చూడటానికి ఓపెన్‌గా ఉంటుందని, వాహనంలో నిజామాబాద్‌ నగరంలోని అన్ని కాల‌నీల్లో తిరుగుతూ అభివృద్ధి పనుల‌ని పరిశీలిస్తూ మరియు నగర ప్రజల‌ సమస్యల‌ను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే వివరించారు.

అనంతరం నగరంలో పనుల‌ పరిశీనలో భాగంగా డివైడర్‌ పైన ఉన్న మొక్కల‌ను, చెట్లను పరిశీలిస్తూ, ఎమ్యెల్యే స్వీయ ఆలోచనతో రూపొందించబడిన వాటర్‌ స్ప్రేయర్‌ ట్యాంకర్‌పై నుండి చెట్లకు నీటిని స్ప్రే చేశారు. ఫులాంగ్‌ చౌరస్తా చేరుకొని అక్కడ సెంటర్‌ మీడియన్‌కు సంబంధించి అధికారుల‌కు సూచనలు చేసి, బగ్గీ టూర్‌ కొనసాగించి, మునిసిపల్‌ కార్యాల‌యం చేరుకొని స్వీపింగ్‌ మెషిన్‌ని తనిఖీ చేసి అధికారుల‌ను వివరాలు అడిగి తెలుసుకుని తగు సూచనలిచ్చారు.

కార్యక్రమంలో నగర మేయర్‌ నీతూ కిరణ్‌, నుడ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం ...

Comment on the article