Breaking News

ఆదర్శం సనత్‌ కుమార్‌ శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో గురువారం దోమకొండ మండల‌ కేంద్రానికి చెందిన సనత్‌ కుమార్‌ శర్మ 59వ సారి ఏ పాజిటివ్‌ రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ గతంలో ఆర్‌.కె. కళాశాల‌ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న సందర్భంలో ఆపదలో ఉన్నవారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తాన్ని అందజేయడం జరిగిందని వీరి లాంటి వ్యక్తుల‌ స్ఫూర్తితోనే కామారెడ్డి రక్తదాతల‌ సమూహాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాల‌ని, ఆపదలో ఉన్న వారికి ఎల్ల‌వేళలా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉంటామని రక్తం అవసరమైనట్లయితే 9492874006 నెంబర్‌కు సంప్రదించాల‌న్నా‌రు. కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్‌, టెక్నీషియన్‌ ఏసుగౌడ్‌ పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article