Breaking News

ఎంపీ బి.బి పాటిల్‌కు ఫేమ్‌ ఇండియా మ్యాగజైన్‌ ఉత్తమ పార్లమెంటీరియన్‌ అవార్డ్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ ఎంపి బి.బి పాటిల్‌ను ఫేమ్‌ ఇండియా మ్యాగజైన్‌ 2021 సంవత్సరం ఉత్తమ పార్లమెంటీరియన్‌గా గుర్తించింది. దేశ వ్యాప్తంగా 25 మంది ఎంపీలు ఎంపిక కాగా తెలుగు రాష్ట్రాల‌ నుండి జహీరాబాద్‌ ఎంపీ బి.బి పాటిల్‌ ఒక్కరే అవార్డుకు ఎంపికయ్యారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డిని హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఎంపీ బి.బి పాటిల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల‌ ఎంపి బి.బి పాటిల్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాల‌ని ఆకాంక్షించారు. ఉత్తమ పార్లమెంటీరియన్‌గా గుర్తించిన ఫేమ్‌ ఇండియా మ్యాగజైన్‌ వారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article