Breaking News

అధికారులు పాజిటివ్‌ థింకింగ్‌తో పని చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు ప్రజల‌కు సేవలందించడంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే కొంత పాజిటివ్‌గా ఉండాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. ప్రణాళిక శాఖ డైరెక్టర్‌గా ప్రమోషన్‌తో పాటు బదిలీపై హైదరాబాద్‌ వెళుతున్న చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ శ్రీరాములుకు గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారుల‌ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సిపివోకు జ్ఞాపిక అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మనమంతా కూడా పబ్లిక్‌ సర్వెంట్లమని రూల్స్‌ ప్రకారంగా పని చేస్తూ ముందుకు వెళ్లాల‌న్నారు. పాజిటివ్‌ థింకింగ్‌ ఉండాల‌ని, మరోవైపు ప్రభుత్వ నిబంధనలు కూడా అతిక్రమించకుండా సేవా భావంతో పనిచేయాల‌న్నారు. పనిచేసే 8 గంటలు పనిమీదే దృష్టి పెట్టాల‌న్నారు.

ప్రమోషన్‌పై హైదరాబాద్‌ వెళ్తున్న శ్రీరాములు ఇకముందు కూడా సేవా భావంతో సంతోషంగా పని చేయాల‌ని కోరుకుంటున్నానన్నారు. నిజామాబాద్‌లో నాలుగు సంవత్సరాలు పని చేశారన్నారు. కార్యక్రమానికి అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, మెప్మా పిడి రాములు, కొత్తగా మెదక్‌ నుండి వచ్చిన సిపిఓ శ్రీనివాస రావు, డిసిఓ సింహాచలం, డీఏఓ గోవింద్‌, జిఎం ఇండస్ట్రీస్‌ బాబురావు, డిపిఓ జయసుధ, డిటిఓ యోహాను, లేబర్‌ ఆఫీసర్‌ సిపిఓ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత ...

Comment on the article