Breaking News

కామారెడ్డిలో విశ్వ ఆగ్రోటెక్ సేవ‌లు

కామారెడ్డి, ఫిబ్రవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఆయిల్‌ఫామ్‌ సాగుపై జిల్లా వ్యవసాయ, ఉద్యానవన అధికారుల‌తో విశ్వ ఆగ్రోటెక్‌ సంస్థ ప్రతినిధులు గురువారం జిల్లాకలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ని కలిసి జిల్లాలో తాము చేపట్టే ఆయిల్‌ ఫామ్‌పై వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో విశ్వ ఆగ్రోటెక్‌ సంస్థ ద్వారా ఆయిల్‌పామ్‌ సాగు, ప్రాసెసింగ్‌ కోసం రైతుల‌కు వ్యవసాయ, ఉద్యానవన శాఖ సహకారంతో నాణ్యమైన ఫామ్‌ ఆయిల్‌ మొక్కల‌ను, డ్రిప్‌ ఇరిగేషన్‌ సౌకర్యం, ఎరువుల‌ సబ్సిడీ ద్వారా అందచేయడం జరుగుతుందని, మొక్క ఎదుగుదల‌కు కావల‌సిన సాంకేతిక సహకారం అందించడమే కాకుండా ఆయిల్‌ ఫామ్‌ 3 వ సంవత్సరం నుండి 30 సంవత్సరాల‌ వరకు వచ్చే ఫామ్‌ ఆయిల్‌ పండ్ల గెలల‌ను తమ సంస్థ కొనడం జరుగుతుందని, తద్వారా రైతుకు ప్రస్తుతం వారు పండిస్తున్న పంట కంటే రెట్టింపు ఆదాయం దీర్ఘకాలం పాటు పొందడం జరుగుతుందని, ఆయిల్‌ ఫామ్‌ సాగుపై రైతుల‌కు ఆసక్తి కలిగే విధంగా వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని, ఇతర ప్రాంతాల‌లో‌ సాగు చేస్తున్న ఆయిల్‌ఫామ్‌ క్షేత్రాల‌ను సందర్శింపచేయడం జరుగుతుందని ప్రతినిధులు వివరించారు.

ఆసక్తి గల‌ రైతులు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల‌ను కానీ, విశ్వ ఆగ్రోటెక్‌ సంస్థ రాంపూర్‌ వారు, డిచ్‌పల్లి మండలం, నిజామాబాదు జిల్లా యొక్క ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను కానీ సంప్రదించాల‌ని, ఇలాంటి మంచి అవకాశాల‌ను రైతును సద్వినియోగం చేసుకోవాల‌ని వారు రైతుల‌ను కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యల‌క్ష్మి, జిల్లా ఉద్యానవన అధికారి రాజు, విశ్వ ఆగ్రోటెక్‌ సంస్థ ప్రతినిథులు బైర సుభాష్‌, ఉప్నిత్‌ రజోలియా పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article