Breaking News

తెలంగాణ ఉద్యమకారుల‌ ఫోరం జిల్లా కో ఆర్డినేటర్‌గా డి.యల్‌.యన్‌.చారి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1993 నుండి 2014 తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు అలుపెరుగని పోరాటం చేసిన, తెలంగాణ ఉద్యమం అనుభవం ఉన్న వ్యక్తి నిజామాబాద్‌ జిల్లా కో ఆర్డినేటర్‌గా నియమించడం రాష్ట్ర కమిటిలో మంచి పరిణామమని రాష్ట్ర కమిటీ నాయకులు అభిప్రాయపడ్డారు.

శుక్రవారం ఉదయం ఫోరమ్‌ రాష్ట్ర కమిటీ ఛైర్మన్‌ డా. చీమల‌ శ్రీనివాస్‌ చేతుల‌మీదుగా నియామక పత్రాన్ని డి.యల్‌.యన్‌.చారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల‌ను స్వతంత్ర సమరయోధుల‌ కింద గుర్తించాల‌ని, జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగే దిశగా ప్రభుత్వం ఆలోచించాల‌ని, అప్పుడే జయశంకర్‌ సార్‌ కన్న కల‌లు నెరవేరుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు,విద్య వేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం ...

Comment on the article