కామారెడ్డి, ఫిబ్రవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషిచేస్తామని డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శరత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాల రక్ష భవన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాల్యవివాహాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తామన్నారు. బాలికలపై రోజురోజుకు వేధింపులు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించేందుకు కమిటి పనిచేస్తుందన్నారు. పసికందులను విక్రయించడం, అనధికారిక దత్తతను తీసుకోవడం నేరమని అలాంటివి ఎక్కడైనా జరిగితే కమిటీ దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు స్వర్ణలత, గంగాధర్, జిల్లా బాల, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ పరిరక్షణ అధికారి అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021