నిజామాబాద్, ఫిబ్రవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్టు న్యాయవాదులు వామనరావ్ నాగమణి దంపతుల జంట హత్యలను నిరసిస్తూ తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషస్స్ పిలుపుమేరకు ఆందోళనలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచి కట్ల గోవర్థన్ మాట్లాడుతూ న్యాయవాదుల హత్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఇప్పటికైనా సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత న్యాయవాద కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని న్యాయవాద వృత్తి రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ఉద్యమం దశలవారీగా కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీధర్, జగన్ మోహన్ గౌడ్, రాజ్‌కుమార్ సుబేదార్, మాధవరావ్, వై విగ్నేష్, వెంకటేష్, శ్రీకాంత్, మాణిక్ రాజ్, సాయిబాబా, దయానంద్, రమేష్, బిట్ల రవి, వసంత్, సురేష్ సంగమేశ్వర రావు, సుదర్శన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021