Breaking News

ప్రఖండ దేశభక్తుడు వీర సావర్కర్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినాయక దామోదర వీర సావర్కర్‌ 55 వ వర్ధంతిని ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్‌లొ నిర్వహించారు. వీర సావర్కర్‌ చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆర్మూర్‌ పట్టణ బిజెపి అధ్యక్షుడు జెస్సు అనిల్‌ కుమార్‌, భారతీయ జనతా కిసాన్‌ మోర్చా పట్టణ అధ్యక్షుడు పాలెపు రాజ్‌ కుమార్‌ు మాట్లాడుతు వినాయక దామోదర్‌ సావర్కర్‌ ఓ ప్రఖంఢ దేశభక్తుడని, దేశ స్వాతంత్రం కోసం చిన్నతనం నుండే దేశ భక్తిని కలిగి దేశానికి స్వాతంత్రం ఎలా సంపాదించాలి అనేటటువంటి దీక్షతో ఓ అగ్నికణంగా మారి ఎందరో దేశభక్తుల‌ను నిర్మాణం చేసిన వ్యక్తి అన్నారు.

సావర్కర్‌ దేశభక్తితో, స్వతంత్రం కోసం చేస్తున్న పోరాటాల‌ను గమనించిన అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఇతను న్యాయవాద పట్టాను పొందడానికి తల‌ వంచి బ్రిటిష్‌ రాణిని నమస్కరించాల‌న్న పద్ధతిని కాదనడంతో న్యాయవాద డిగ్రీ పట్టాను ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడమైనదని, అంతేకాకుండా ఇతని ఉపన్యాసాల‌ ద్వారా ఎందరో దేశభక్తుల‌ నిర్మాణం అవుతున్నారన్న కుట్రతో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఇతనిని అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఉండే ‘‘కాలాపాని’’ అనే జైలులో సావర్కర్‌ను ఉంచారన్నారు. తన జీవితంలో సగ భాగం జైలులోనే గడిపారని, దేశానికి స్వాతంత్రం సాధించాల‌న్న ల‌క్ష్యంతో, తాను జైలులో కాకుండా బయట ఉంటే ఎందరో దేశభక్తుల‌ నిర్మాణం చేయాల‌న్న సంక‌ల్పంతో ఓ రోజు జైలులో ఉన్నటువంటి ఖైదీల‌ను వేరే జైలుకు మార్చే సమయంలో ఓడలో బయలుదేరిన సమయంలో పాయిఖానాకు వెళ్తానని చెప్పి పాయిఖానాలో ఉన్నటువంటి చిన్న రంధ్రంలో తన శరీరాన్ని కుదించుకుని అక్కడి నుండి తప్పించుకుని శరీరమంతా గాయాల‌తో, రక్తంతో సముద్రపు ఉప్పు నీటిలో ఈదుతూ ఒడ్డుకు చేరారన్నారు.

సావర్కర్‌ హిందూ ధర్మం, హిందూ సంస్కృతిని కాపాడాల‌న్న ల‌క్ష్యంతో పని చేయడమే కాకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా హిందువే అని నినదించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు ఆకుల‌ శ్రీనివాస్‌, గిరిజన మోర్చ మాజీ జిల్లా అధ్యక్షుడు కొర్ర గంగాధర్‌, బీజేవైఎం ఆర్మూర్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి పసుపుల‌ సాయికుమార్‌, ఉపాధ్యక్షుడు పెరంబదూర్‌ వాసు, దళిత మోర్చ ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షుడు పులి యుగంధర్‌, గిరిజన మోర్చ ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షుడు పీర్‌ సింగ్‌ నాయక్‌, బీసీ మోర్చ ఆర్మూర్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి మిర్యాల్‌కర్‌ కిరణ్‌ కుమార్‌, కిసాన్‌ మోర్చా ఆర్మూర్‌ పట్టణ ప్రధాన కార్యదర్శులు బ్రాహ్మణ్‌ పల్లి సంజీవ్‌, దొడ్ల నారాయణ, ఉపాధ్యక్షుడు శేశగిరి లింగం, బిజెపి, వివిధ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

అంబులెన్స్ ప్రారంభం

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎన్ఆర్ఐ దాతలు డొనేట్ చేసిన అంబులెన్్స‌ను జిల్లా కలెక్టర్ ...

Comment on the article