Breaking News

వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకుంఠధామాల‌ను త్వరితగతిన పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ పంచాయితీ రాజ్‌ అధికారుల‌ను ఆదేశించారు. శుకవారం జనహిత భవన్‌లో ఆర్‌డిఓలు, పంచాయితీరాజ్‌ ఇంజనీర్లతో వైకుంఠధామం పనుల‌ను మండలాల‌ వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠధామాల‌లో మిగిలిన ల‌క్ష్యాన్ని వెంటనే పూర్తి అయ్యేలా క్షేత్రస్థాయిలో ఎఇ, డిఇలు పర్యవేక్షించాల‌ని ఆదేశించారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ పనుల‌కు సంబంధించి ఇసుక కొరత లేదని, ఆర్‌డిఓల‌ సహకారంతో ఇసుక సిద్ధం చేసుకోవాల‌ని సూచించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పనుల‌ను ఎప్పటికప్పడు రికార్డు చేయాల‌ని, వచ్చే పదవ తేదీలో ఎఫ్టిఓ జనరేట్‌ పను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డిఓలు ఎస్‌.శీను, రాజాగౌడ్‌, పంచాయితీరాజ్‌ డివిజనల్‌ ఇంజనీర్లు, ఇఇ వీరేందర్‌ రావు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Check Also

చత్తీస్‌ఘడ్‌ అమర జవాన్లకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌లోని మావోయిస్టుల‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర ...

Comment on the article